నేటి విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవడానికి... ప్రైవేటు శిక్షణ తరగతుల కంటే ఆన్లైన్లో పాఠాలు వినడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తాజాగా చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది.
'గ్రేడ్ అప్' అనే సాంకేతిక విద్యా వేదిక నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మూడు నెలల్లో జేఈఈ, నీట్, గేట్, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న సుమారు పదివేల మంది విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించింది.
ఆన్లైన్ వైపే మొగ్గు..
ఈ సర్వేలో 90 శాతం మంది విద్యార్థులు ఆఫ్లైన్ కోచింగ్ కంటే ఆన్లైన్ కోచింగ్ వైపే మొగ్గుచూపారని ఈ సర్వే స్పష్టం చేసింది.
ఎక్కువ మంది లైవ్ తరగతులను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. అధ్యాపకులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి తమకు వచ్చిన సందేహాలను తక్షణమే నెరవేర్చుకునే అవకాశం. రోజువారి పాఠ్యప్రణాళికను పక్కాగా పూర్తి చేసుకునే సదుపాయం కలిగి ఉండటం.