తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేదార్​నాథ్​'ను ముంచెత్తిన మంచు.. చిక్కుకున్న కూలీలు

కేదార్​నాథ్​ క్షేత్రంలో మంచు భారీగా కురుస్తోంది. 8 అడుగుల ఎత్తులో హిమం పేరుకుపోయి ఆలయాన్ని కప్పేసింది. ధామ్ నిర్మాణ పనులకు వచ్చిన కూలీలు సగం మంది తిరిగి వెళ్లిపోగా.. అక్కడే చిక్కుకున్న 11 మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డకట్టిన నీటిని కరిగించి దాహం తీర్చుకుంటున్నారు.

SNOWFALL IN KEDARNATH DHAM RUDRAPRAYAG, UTTHARAKHAND
'కేదార్​నాథ్​'ను ముంచెత్తిన మంచు.. చిక్కుకున్న కూలీలు

By

Published : Dec 17, 2019, 2:35 PM IST

Updated : Dec 17, 2019, 8:00 PM IST

'కేదార్​నాథ్​'ను ముంచెత్తిన మంచు.. చిక్కుకున్న కూలీలు

ఉత్తరాఖండ్​ రుద్రప్రయాగ్​లో నిరవధికంగా మంచు వర్షం కురుస్తోంది. సముద్రమట్టానికి 3584 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కేదార్​నాథ్​ ధామ్​లో భారీ హిమపాతం నమోదైంది. సుమారు 8 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. హిమ పర్వత అందాలు కనువిందు చేస్తున్నా.. స్థానికులకు మాత్రం ప్రాణగండంగా మారింది.

మంచు కారణంగా ఇప్పటికే కేదార్​నాథ్​ క్షేత్రంలో అన్ని పూజా కార్యక్రమాలు నిలిపివేశారు. విద్యుత్తు, సమాచార సేవలూ నిలిచిపోయాయి.

కూలీల ఇక్కట్లు..

ధామ్​లో శంకరాచార్య సమాధి స్థలం, ఘాట్​ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే మైనస్​ 12 డిగ్రీల ఉష్టోగ్రత వద్ద.. ఆలయంలో ఉన్న కూలీలు చలికి వణికిపోతున్నారు. ఈ కారణంగా నిర్మాణ పనులూ నిలిచిపోయాయి.

రక్తం గడ్డకట్టే చలికి 12 మంది కార్మికులు ధామ్​ నుంచి వెళ్లిపోగా.. మరో 11 మంది క్షేత్రంలోనే ఉండిపోయారు. వీరు కనీసం మంచి నీరు తాగాలన్నా.. మంచును కరిగించి దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి:'లింగ వ్యత్యాస సూచీ'లో మరింత కిందకు భారత్​

Last Updated : Dec 17, 2019, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details