తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​: ఆసుపత్రి ఆవరణలో అస్థిపంజర భాగాలు

బిహార్​ ముజఫర్​పుర్​లోని శ్రీకృష్ణ ఆసుపత్రి ఆవరణలో మానవ అస్థిపంజర భాగాలు కనబడటం కలకలం రేపింది. గుర్తు తెలియని శవాలను ఇక్కడ ఖననం చేసినట్లు దర్యాప్తు బృందం తెలిపింది. మెదడువాపు వ్యాధి బారిన పడి ఈ ఆసుపత్రిలో ఇటీవలే 108 మంది చిన్నారులు మరణించారు.

బిహార్​: ఆసుపత్రి ఆవరణలో అస్థిపంజర భాగాలు

By

Published : Jun 22, 2019, 5:41 PM IST

Updated : Jun 22, 2019, 7:56 PM IST

బిహార్​: ఆసుపత్రి ఆవరణలో అస్థిపంజర భాగాలు

బిహార్​ ముజఫర్​పుర్ శ్రీకృష్ణ వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో మానవ అస్థిపంజర భాగాలను గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టిన అనంతరం అక్కడ గుర్తు తెలియని శవాలను ఖననం చేసినట్లు నిర్ధరించారు.

శవాల పంచనామాకు సంబంధించిన విభాగం.. కళాశాల ప్రిన్సిపల్​ అధీనంలో ఉంటుందని ఆసుపత్రి సీనియర్ వైద్యులొకరు చెప్పారు. ఈ విషయంపై ఆయనే వివరణ ఇస్తారని తెలిపారు.

అస్థిపంజరాల భాగాలకు సంబంధించిన విషయంపై నివేదిక సమర్పించాలని ఆసుపత్రి నిర్వహణ అధికారులను ఆదేశించారు ముజఫర్​పుర్ డీఎం అలోక్ రంజన్​.


ఇటీవలే మెదడు వాపు వ్యాధితో శ్రీకృష్ణ ఆసుపత్రిలో 108 మంది చిన్నారులు మరణించారు. ఈ వ్యాధి కారణంగా ముజఫర్​పుర్​లో మొత్తం 128 మంది పిల్లలు మృత్యువాతపడ్డారు.

ఇదీ చూడండి: కర్కశం: భార్య, ముగ్గురు పిల్లల గొంతుకోసి హత్య

Last Updated : Jun 22, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details