రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా మహేష్పురాలో భక్తులతో ప్రయాణిస్తున్న బస్సు విద్యుదాఘాాతానికి గురైంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి.
జలోర్ తాలూకా మహేష్‌పురా గ్రామంలోకి ప్రవేశించగానే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని.. ఫలితంగా వేలాడుతున్న విద్యుత్ తీగను బస్సు తాకి మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రైవేటు బస్సు బార్మెర్ నుంచి భక్తులతో అజ్మీర్‌లోని బేవార్‌కు బయలుదేరిందని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ హిమ్మత్ సింగ్ తెలిపారు.