తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా రికార్డ్: ఒక్కరోజులో 57 వేలకుపైగా కేసులు

దేశంలో కొవిడ్ విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 57,117 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 764 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది.

Single-day spike of 57,117 positive cases & 764 deaths in India in the last 24 hours.
కరోనా రికార్డ్: ఒక్కరోజులో 57 వేలకుపైగా కేసులు

By

Published : Aug 1, 2020, 9:46 AM IST

Updated : Aug 1, 2020, 10:01 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 57,117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇదే అత్యధిక పెరుగుదల.

దీంతో మొత్తం బాధితుల సంఖ్య 16,95,988కి పెరిగింది. మరో 764 మంది బాధితులు కరోనా ధాటికి మృతి చెందారు. ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 36,511కి ఎగబాకింది.

  • యాక్టివ్ కేసులు 5,65,103
  • కోలుకున్నవారు 10,94,374

రాష్ట్రాల్లో..

రాష్ట్రాల్లోనూ కరోనా ఆందోళనకరంగా ఉంది. మహారాష్ట్రలో రోజువారి కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్తగా 10,230 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 4,22,118కు చేరింది. మరో 265 మంది మృతితో.. మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో 15 వేలకు చేరువైంది. మొత్తం 2,56,158 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

కన్నడ నాట కరోనా విస్తరిస్తోందిలా..

దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ కరోనా విలయం కొనసాగుతోంది. వరుసగా ఎనిమిదో రోజూ 5 వేలకు పైగా వైరస్​ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 5,483 కొత్త కేసులు వెలుగుచూడగా.. మొత్తం 1,24,115 మంది కొవిడ్​ బారినపడ్డారు.

వైరస్​ ధాటికి మరో 84 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 2,314కు చేరింది. వైరస్​ నుంచి కోలుకొని శుక్రవారం నాడు 3,130 మంది డిశ్చార్జ్​ అయ్యారు. ఫలితంగా ఇప్పటివరకు మొత్తం 49,788 మందికి వైరస్​ నయమైనట్లయింది. సుమారు 72 వేల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తమిళనాడు

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో 5,881 మందికి కరోనా సోకింది. మరో 97మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,45,859కి చేరింది. మృతుల సంఖ్య 3,935కి పెరిగింది. ప్రస్తుతం 57,968 యాక్టివ్​ కేసులున్నాయి.

యూపీలో..

రాష్ట్రం​లో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. మరో 4,453 మందికి వైరస్​ సోకింది. 24 గంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,15,618కి చేరింది.

దిల్లీలో కరోనా..

దేశ రాజధాని ప్రాంతంలో కొత్తగా 1,195 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 3,963కు పెరిగింది.

కేరళలో ఒక్కరోజులో 1310 మంది కరోనా బారినపడ్డారు

Last Updated : Aug 1, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details