తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంతూళ్లకు లక్ష మందికిపైగా వలస కూలీలు

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఇప్పటి వరకు 115 శ్రామిక్​ రైళ్లను నడిపినట్లు కేంద్రం ప్రకటించింది. లక్ష మందికిపైగా కూలీలను తరలించినట్లు వెల్లడించింది. భౌతిక దూరం పాటించే క్రమంలో ఒక్కో బోగీలో 54 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Shramik Trains
115 శ్రామిక్​ రైళ్లలో.. లక్ష మందికిపైగా వలస కూలీల తరలింపు

By

Published : May 6, 2020, 3:34 PM IST

లాక్​డౌన్​తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఇప్పటి వరకు 115 శ్రామిక్​ రైళ్లను నడిపినట్లు ప్రకటించింది రైల్వే శాఖ. మే 1 నుంచి లక్ష మందికిపైగా వలస జీవులను వారి వారి స్వస్థలాలకు చేర్చినట్లు తెలిపింది. బుధవారం గమ్యస్థానాలకు వెళ్లాల్సిన 42 రైళ్లలో ఇప్పటికే 22 బయలుదేరాయని.. మిగతా 20 రైళ్లు ఈ రోజు రాత్రికి ప్రయాణం ప్రారంభిస్తాయని స్పష్టం చేసింది.

ఒక్కో బోగీలో 54 మందే..

ఒక్కో శ్రామిక్​ రైలులో 24 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 72 సీట్లు ఉంటాయి. కానీ.. భౌతిక దూరం పాటించే క్రమంలో 54 మందిని మాత్రమే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. 90 శాతం మేర సీట్లు నిండిన తర్వాతే.. రైలు బయలుదేరుతుందని రాష్ట్రాలకు ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు గుర్తుచేశారు.

10 రైళ్లు రద్దు

వచ్చే ఐదురోజుల్లో వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 10 రైళ్లలను రద్దు చేసింది కర్ణాటక ప్రభుత్వం. అయితే.. ముందస్తు ప్రణాళిక ప్రకారం 3 రైళ్లు బెంగళూరు నుంచి బిహార్​కు బయలుదేరుతాయని స్పష్టం చేసింది.

ఒక్కో రైలుకు రూ.80 లక్షలు ఖర్చు!

కూలీల తరలింపునకు కేంద్ర, రాష్ట్రాలు 85:15 నిష్పత్తిలో ఖర్చు భరిస్తాయని ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు ఎంత మేర ఖర్చు చేశారనే అంశంపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే.. ఒక్కో రైలుకు సుమారు రూ.80 లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వివిధ రాష్ట్రాలకు చేరుకున్న రైళ్ల వివరాలు

గుజరాత్​ నుంచి అధికంగా 35 ట్రైన్లు వివిధ గమ్యస్థానాలుకు వెళ్లగా.. ఆ తర్వాతి స్థానంలో 13 రైళ్లతో కేరళ ఉంది.

రాష్ట్రం చేరుకున్న రైళ్లు మార్గ మధ్యలో ఉన్నవి బయలుదేరాల్సినవి
బిహార్​ 13 11 6
ఉత్తర్​ప్రదేశ్ 10 5 12
ఝార్ఖండ్​ 4 5 2
ఒడిశా 7 5 1

బంగాల్ ప్రభుత్వం కేవలం రెండు రైళ్లకే అనుమతించింది. ఒకటి రాజస్థాన్​, మరొకటి కేరళ నుంచి రావాల్సి ఉండగా ఇప్పటికే బయలు దేరాయి.

ABOUT THE AUTHOR

...view details