తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశమంతా శివమయం

దేశవ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు శివాలయాలకు తరలివస్తున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివన్నామస్మరణతో మార్మోగుతున్నాయి.

వారణాసి

By

Published : Mar 4, 2019, 12:51 PM IST

Updated : Mar 4, 2019, 3:02 PM IST

శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పరమ శివుడి దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ శబ్దంతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.

దేశమంతా ఘనంగా శివరాత్రి పర్వదినం

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో శంభోశంకర నినాదం ప్రతిధ్వనిస్తోంది. కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని భక్తులు పులకిస్తున్నారు. రథోత్సవాల్లో వేలాది మంది భక్తులు, సాధువులుపాల్గొంటున్నారు. గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

జ్యోతిర్లింగ క్షేత్రమైన నాసిక్​లోని త్రయంబకేశ్వర ఆలయంలో ఈశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, ఉత్తర్​ప్రదేశ్​ సహా అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఉజ్జయినీలోని మహాకాలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

శివరాత్రి సందర్భంగా హరిద్వార్​లోని గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఘాట్లన్నీ నిండిపోయాయి.

జమ్ముకశ్మీర్​లోనూ..

జమ్ముకశ్మీర్​లో ప్రజలు శివాలయాలకు తరలివెళుతున్నారు. శివ్​ఖోరీ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

Last Updated : Mar 4, 2019, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details