తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏపై అవగాహనకు రాజస్థాన్​లో 'షా' ర్యాలీ

రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్​ షా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పౌరసత్వ చట్ట సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్పష్టం చేశారు.

Shah to address rally in Jodhpur on Friday to spread awareness on CAA
సీఏఏపై అవగాహనకు రాజస్థాన్​లో షా ర్యాలీ

By

Published : Dec 31, 2019, 7:04 AM IST

Updated : Dec 31, 2019, 7:50 AM IST

పౌర నిరసనలతో దేశం అట్టుడుకుతున్న తరుణంలో పారసత్వ చట్ట సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సతీశ్​ పోనియా ప్రకింటించారు. ఈ ర్యాలీలో 50వేలకుపైగా ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

పాకిస్థాన్​ నుంచి భారీ సంఖ్యలో వచ్చిన హిందువులు.. రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో నివసిస్తున్నందున ఆ ప్రాంతాన్ని ర్యాలీ నిర్వహణకు ఎంపిన చేసినట్టు వెల్లడించారు పోనియా.

సీఏఏ...

2014 డిసెంబర్​ 31 ముందు వరకు పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు పౌరసత్వం కల్పించడానికి సంకల్పించిన సీఏఏను పార్లమెంట్​ ఆమోదించింది. దీనితో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈశాన్య భారతంలో మొదలైన నిరసనలు.. యావత్​ భారతాన్ని కుదిపేస్తున్నాయి. పలుచోట్ల హింసకు దారితీశాయి.

ఇదీ చూడండి: ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది: అమిత్ షా

Last Updated : Dec 31, 2019, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details