దిల్లీలో కొంతమంది కేంద్రమంత్రులు ప్రభుత్వం కేటాయించిన అధికారిక భవనాల బకాయిలు చెల్లించలేదని తెలిపింది కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎవరెవరు ఎంత బకాయిలు చెల్లించాలన్న సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు అధికారులు.
విజయ్ గోయెల్ రూ.3 లక్షలు, ప్రకాశ్ జావడేకర్ రూ. 86,923, నిర్మలా సీతారామన్ రూ. 53,276, సుష్మా స్వరాజ్ రూ. 98,890 చెల్లించాలని ప్రకటించింది. వీరితో పాటు కేంద్ర సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ(రూ.1.46 లక్షలు), జితేంద్ర సింగ్(రూ.3.18 లక్షలు), కేంద్ర వ్యవసాయ సహాయమంత్రి గజేంద్ర సింగ్(రూ. 2.8 లక్షలు) ప్రభుత్వ భవనాల బకాయిలు చెల్లించలేదని స్పష్టం చేసింది.