తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరస్​ను తిప్పికొట్టే కోటింగ్​తో.. వైద్యులు సేఫ్​! - corona safety measures

ఇకపై వైద్యులు మరింత ధైర్యంగా కరోనాతో పోరాడవచ్చు. పీపీఈలపై వైరస్​ను తిప్పికొట్టే ఓ వస్త్ర పూతను రూపొందిచారు అమెరికా శాస్త్రవేత్తలు. ఎన్ని సార్లైనా ఉతికి ఉపయోగించే వీలున్న ఈ కోటింగ్​ ద్వారా పీపీఈల కొరతకూ ఓ పరిష్కారం దొరుకనుంది.

Scientists create washable coating for PPEs that repels viruses
వైరస్​ను తిప్పికొట్టే కోటింగ్​తో.. వైద్యులు సేఫ్​!

By

Published : May 14, 2020, 6:27 PM IST

కరోనా బారి నుంచి ఎందరినో రక్షిస్తున్న వైద్యులు... వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) కొరతతో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సార్లు పీపీఈలు ధరించినా.. వాటిపై అంటుకున్న వైరస్​​.. వైద్య బృందాలకే చుట్టుకుని ఉసురుతీసుకుంటోంది. అందుకే, డాక్టర్లను ఈ​ ప్రమాదం నుంచి తప్పించేందుకు పీపీఈలను సురక్షితంగా ఉపయోగించుకునేలా ఓ వస్త్ర పూత(పీపీఈ కోటింగ్​)ను రూపొందించారు అమెరికా శాస్త్రవేత్తలు.

పిట్స్​బర్గ్ విశ్వవిద్యాలయ బృందం.. రక్తం, లాలాజలం వంటి ద్రవాలను, ఉపరితలంపై ఉండే వైరస్​, బ్యాక్టీరియాలను తిప్పికొట్టే వస్త్రపూతను సృష్టించింది. వైరస్​ను తీసుకుని మరో చోట దాన్ని బలహీనం చేస్తుంది ఈ పీపీఈ కోటింగ్​.

వస్త్రంతో తయారుచేసిన ఈ కోటింగ్​ను ఎన్ని సార్లైనా ఉతికి తిరిగి ఉపయోగించవచ్చు.. ఫలితంగా వైద్య బృందాలకు వైరస్​ సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ వస్త్రాన్ని ఎన్ని సార్లు ఉతికినా, రుద్దినా పాడవ్వనంత దృఢంగా రూపొందించారు.

అయితే, ఈ పీపీఈ కోటింగ్​ పలు రకాల బ్యాక్టీరియాలపై ప్రయోగించగా అన్నింటినీ ఈ పూత జయించింది. కానీ కొవిడ్​పై ఇంకా ప్రయోగాత్మకంగా పరీక్షించలేదు. కరోనా వైరస్​ను తిప్పికొట్టగలిగితే, ఇది వైద్యసిబ్బందికే కాదు, సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరం.

ఇదీ చదవండి:'డాక్టర్ మామిడి'ని ఆరగిస్తారా? 'పోలీస్​​ మ్యాంగో' కావాలా?

ABOUT THE AUTHOR

...view details