తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడే విచారణ

సీఏఏ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 100కుపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్​ సహా 143 మంది ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

SC to hear pleas challenging CAA on Wednesday
సీఏఏను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ

By

Published : Jan 22, 2020, 4:57 AM IST

Updated : Feb 17, 2020, 10:55 PM IST

సీఏఏను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడే విచారణ

పౌరసత్వ చట్ట సవరణను సవాల్​ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. సీఏఏ రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇండియన్​ ముస్లిం లీగ్​ (ఐయూఎమ్​ఎల్), కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్​ సహా పలువురు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ ఏ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం డిసెంబర్ 18న కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

2014 డిసెంబర్ 31న లేదా అంతకుముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్​కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు పౌరసత్వం ఇచ్చేందుకు.. కేంద్రం పౌరచట్టాన్ని తెచ్చింది

భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ.. ముస్లింలపై వివక్ష చూపేవిధంగా సీఏఏ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈనెల 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని నిలిపివేయాలని ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

మరోవైపు పౌరచట్టం రాజ్యాంగ బద్ధమేనని ప్రకటించాలని ఈనెల 9న దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దేశం ప్రస్తుతం కిష్ల పరిస్థితుల్లో ఉందని, పెద్దఎత్తున హింస జరిగిందని సుప్రీం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం నెలకొనే ప్రయత్నాలు జరగాలని సూచించింది.

Last Updated : Feb 17, 2020, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details