ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ పూర్వాపరాలపై... విచారణకు ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ చౌహాన్‌ను నియమిస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సుప్రీంకోర్టు తాజాగా ఆమోదం తెలిపింది.
రెండు నెలల్లో విచారణ పూర్తి!
యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ముఠా జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి చెందారు. ఆ తరువాత తప్పించుకు పారిపోయిన వికాస్ దుబే, అతని ఐదుగురు అనుచరులు వేర్వేరు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం... ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ చౌహాన్‌ను, మరో ఇద్దరు సభ్యులుగా... హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శశికాంత్ అగర్వాల్, రిటైర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ యూపీ కేఎల్ గుప్తాను నియమించింది.