29 ఏళ్ల నాటి కస్టడీలో వ్యక్తి మృతి కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చింది జామ్ నగర్ సెషన్స్ కోర్టు. ఆయనతో పాటు మరో ఆరుగురు పోలీసులను దోషులుగా ప్రకటించింది.
భట్‌తో సహా మరో పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ సింగ్ జాలాకు భారతీయ శిక్షాస్మృతి-302 ప్రకారం జీవిత ఖైదు విధించింది. ఎస్ఐ దీపక్ షా, శైలేశ్ పాండ్య, కానిస్టేబుళ్లు ప్రవీణ్ సింగ్ జడేజా, అనోప్ సింగ్ జెథ్వా, కేషుబా జడేజాలకు రెండేళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది.
ఇదీ జరిగింది..
1990 అక్టోబర్ 30న మతఘర్షణల కారణంతో గుజరాత్‌లోని జామ్జోధ్పుర్లో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అదనపు ఎస్పీగా సంజీవ్ భట్ ఉన్నారు. అనంతరం వారందరినీ విడిచిపెట్టగా.. ప్రభుదాస్ వైష్ణాని అనే వ్యక్తి ఆసుపత్రిలో మరణించారు.