ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై మహాత్మగాంధీ చిత్రాన్ని ప్రచురించటాన్ని రాజ్యసభ ఎంపీలు తప్పుబట్టారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సభాపతిని కోరారు ఎంపీలు.
మద్యం బాటిళ్లపై గాంధీ.. రాజ్యసభ అభ్యంతరం - ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ మద్యం కంపెనీపై రాజ్యసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం బాటిళ్లపై మహాత్మగాంధీ చిత్రాన్ని ప్రచురించటాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లాలని సభాపతిని కోరారు.
మద్యం బాటిళ్లపై గాంధీ.. రాజ్యసభ అభ్యంతరం
ఎగువ సభలో శూన్య గంటలో భాగంగా ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ ఈ విషయాన్ని సభలో లేవనెత్తారు. భారత జాతి పితను ఇజ్రాయెల్ కంపెనీ అగౌరవపరిచిందని ఆరోపించారు. కంపెనీపై తగిన చర్యలు తీసుకుని సీసాలపై మహాత్ముడి చిత్రాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సభలో చాలా మంది ఎంపీలు మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి: ఇలా నిరసన తెలిపే నాయకుణ్ని చూసుండరు!
Last Updated : Jul 3, 2019, 5:29 AM IST