తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొత్త ఎంవీ చట్టంతో రూ.577 కోట్ల చలాన్ల జారీ'

మోటారు వాహనాల చట్టం(సవరణ)-2019 అమలులోకి వచ్చిన తర్వాత సుమారు రూ.577 కోట్ల విలువైన 38 లక్షల చలాన్లు జారీ అయ్యాయి. ఎన్​ఐసీలో అందుబాటులో ఉన్న 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని డేటాను లోక్​సభకు అందించారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ.

చలాన్లు

By

Published : Nov 21, 2019, 7:26 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణ, సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టం (సవరణ)-2019 అమలు తర్వాత వాహనదారుల జేబులకు భారీ స్థాయిలో చిల్లు పడింది. సుమారు రూ.577.5 కోట్ల విలువైన 38 లక్షల చలాన్లు జారీ అయినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. కోర్టులకు సిఫార్సు చేసిన చలాన్ల డేటా మాత్రమే అందుబాటులో ఉందని.. ఇప్పటి దాకా వచ్చిన ఆదాయమెంతో తెలియదని లోక్​సభ వేదికగా తెలిపారు.

"ఎన్​ఐసీలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 38,39,406 చలాన్లు జారీ అయ్యాయి. వీటి విలువ రూ.5,77,51,79,895గా ఉంది"

- నితిన్​ గడ్కరీ.

తొలిస్థానంలో తమిళనాడు..

చలాన్ల జారీలో.. 14,13,996తో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. కేవలం 58 చలాన్లతో గోవా చివరి స్థానంలో ఉంది.

సెప్టెంబర్​ 1 నుంచి...

కఠిన నిబంధనలు, భారీ స్థాయిలో జరిమానాలను విధించేందుకు తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్ట సవరణ-2019 ఈ ఏడాది సెప్టెంబర్​1 నుంచి అమల్లోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జరిమానాల విలువను తగ్గించాయి. ఈ చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాల సమాచారం తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.

ఇదీ చూడండి: కేంద్రప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం

ABOUT THE AUTHOR

...view details