అధికరణ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షలపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి చురకలు అంటించింది సుప్రీంకోర్టు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షలు విధించినప్పటికీ... ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. రెండు నెలలు గడిచినా పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగించటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
జమ్ముకశ్మీర్లో ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
"ఎన్ని రోజులు ఆంక్షలు కొనసాగించాలని అనుకుంటున్నారు? ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. ఈ పరిస్థితులను మార్చేందుకు ఇతర పద్ధతులను కనుక్కోవాలి. మీరు ఆంక్షలు విధించినప్పటికీ.. మీ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అది మీరు చేస్తున్నారా? "
- సుప్రీం ధర్మాసనం.