తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​ వెనక్కితగ్గితేనే సంబంధాల పునఃసమీక్ష' - కశ్మీర్​ పై నిర్ణయం

కశ్మీర్​పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే దౌత్య సంబంధాల పునరుద్ధరణపై పునఃసమీక్షిస్తామని ప్రకటించారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి. సిమ్లా ఒప్పందం ప్రకారం కశ్మీర్ అంశంపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

'కశ్మీర్​పై వెనక్కితగ్గితేనే దౌత్య సంబంధాలపై పునఃసమీక్ష'

By

Published : Aug 9, 2019, 5:13 AM IST

కశ్మీర్​పై వెనక్కి తగ్గితే భారత్​తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంపై సమీక్షిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం బుధవారం భారత రాయబారిని వెనక్కి పంపిస్తామని ప్రకటించింది పాక్. భారత్​తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామని ప్రకటించింది.

"వారు(భారత్​) తమ నిర్ణయాలను సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారా? వారు సిద్ధంగా ఉంటే మా నిర్ణయాలను పునఃసమీక్షించుకునేందుకు సిద్ధమే. సమీక్ష ఇరువైపులా జరగాలి. ఇదే సిమ్లా ఒప్పందం చెప్తోంది."

-షా మహమూద్ ఖురేషి, పాక్ విదేశాంగ మంత్రి.

నాటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని పరిశీలిస్తామని... 1972లో జరిగిన ఈ ఒప్పందమే ఇరు దేశాల దౌత్య సంబంధాలకు మార్గదర్శి అని వ్యాఖ్యానించారు ఖురేషి.పాక్ రైల్వే మంత్రి సంఝౌతా ఎక్స్​ప్రెస్​ రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని ఖురేషి సమర్థించారు.

కశ్మీర్ అంశం అంతర్గత వ్యవహారమని భారత్ ప్రకటించడం సరికాదని... 14 సందర్భాల్లో కశ్మీరీల అభీష్టానికి అనుగుణంగానే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నాటి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు ఖురేషి.

కశ్మీరీల సమస్యను ఐక్యరాజ్యసమితి వద్ద లేవనెత్తుతామని వెల్లడించిన ఆయన... పాకిస్థాన్ గగనతలాన్ని మూసేశామన్న వార్తల్లో నిజం లేదన్నారు. తమ గగనతలం ఇప్పటికీ తెరిచే ఉంచామన్నారు. కర్తార్​పూర్ నడవా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపిన పాక్​ విదేశాంగ మంత్రి... భారత్​తో అసఖ్యత ప్రభావం అఫ్గాన్​పై చూపించబోమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: లైవ్​: కశ్మీర్ భద్రత, భవితపై మోదీ హామీ

ABOUT THE AUTHOR

...view details