తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుండె శస్త్రచికిత్సకు ఎయిమ్స్​ త్రీడీ సాంకేతికత

ఎయిమ్స్​ వైద్యులు గుండె శస్త్ర చికిత్సను మరింత సులభతరం చేసే దిశగా 3-డీ సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఎయిమ్స్ వైద్య కళాశాలలో పరిశోధనలు జరుగుతున్నాయి.  త్రీడీ సాంకేతికత గుండె శస్త్ర చికిత్సను సులభతరం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండె శస్త్రచికిత్సకు ఎయిమ్స్​ త్రీడీ సాంకేతికత

By

Published : Mar 29, 2019, 6:02 AM IST

గుండె శస్త్రచికిత్సకు ఎయిమ్స్​ త్రీడీ సాంకేతికత
రోగులకు మెరుగైన చికిత్సను అందించేందుకు వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఎయిమ్స్ వైద్యులు. గుండెకు శస్త్రచికిత్స చేయడం వైద్యులకు అత్యంత కఠినమైన సవాల్. దీనిని విజయవంతంగా పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. సర్జరీకి ముందు హృదయాన్ని అన్ని విధాలా పరీక్షిస్తారు. ఇప్పటి వరకు 2-డీ సాంకేతికతను ఉపయోగించి మాత్రమే రోగికి గుండె పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి 3-డీ పరీక్షలు నిర్వహిస్తారు. 3-డీ తో పోలిస్తే 2-డీ కొంచెం క్లిష్టంగా ఉండేదని గుండె శస్త్ర చికిత్స నిపుణులు తెలిపారు. 2-డీ పరీక్షలు నిర్వహించాకా కొన్నిసార్లు శస్త్ర చికిత్సలో మార్పులు చేయాల్సి వచ్చేదని వివరించారు. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యులు 3-డీ సాంకేతికతను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.

" గుండె త్రీడీ ఆకృతిలో ఉంటుంది. మనం సాధారణంగా ఇప్పటి వరకు 2-డీలోనే చూశాం. నూతన సాంకేతికత సహాయంతో ఇక నుంచి త్రీడీలో చూడగలం. దీని ఆధారంగా శస్త్ర చికిత్సకు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. సర్జరీని తక్కవ సమయంలో పూర్తి చేయొచ్చు. త్రీడీ తక్కువ ఖర్చుకే అందుబాటులో ఉంది."
డా. సౌరభ్ గుప్తా, సహాధ్యాపకులు

ABOUT THE AUTHOR

...view details