తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వగ్రామానికి ఉన్నావ్ బాధితురాలి మృతదేహం

దిల్లీలోని సఫ్దర్​జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఉన్నావ్ బాధితురాలని మృతదేహం స్వగ్రామానికి నిన్న రాత్రి చేరుకుంది. పోలీసులు ఆమె నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యోగీ సర్కారు ప్రకటించిన రూ.25లక్షల పరిహారాన్ని బాధితురాలి తండ్రికి అందజేశారు యూపీ మంత్రి.

unnav victim
స్వగ్రామానికి ఉన్నావ్ బాధితురాలి మృతదేహం

By

Published : Dec 8, 2019, 5:39 AM IST

కాలిన గాయాలతో చికిత్సపొందుతూ దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూసిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె స్వస్థలమైన యూపీలోని ఉన్నావ్‌ గ్రామానికి తరలించారు.శనివారంరాత్రి9గంటలకుబాధితురాలి మృతదేహం ఉన్నావ్‌చేరుకుంది. కాటేసిన కామాంధుల చేతిలోనే మరోసారి దాడికి గురై, ప్రాణాలు కోల్పోయిన బాధితురాలిని చూసి ఉన్నావ్ శోకసంద్రమైంది. బాధితురాలి ఇంటివద్దకు పెద్దఎత్తున ప్రజలు చేరుకోగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

రూ.25లక్షల పరిహారం అందజేత..

యోగి సర్కారు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారాన్ని బాధితురాలి కుటుంబానికి అందజేశారు యూపీ కార్మికశాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య. బాధితురాలి తండ్రికి చెక్‌ను ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
అంతకుముందు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రుల బృందాన్ని నిరసనకారులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి

ABOUT THE AUTHOR

...view details