బంగాల్లో సీబీఐ తీరును నిరసిస్తూ రాజ్యసభలో విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. సభాపతి ఎంతగా వారించిప్పటికీ సభ్యులు వినకపోవడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు.వరుసగా రెండోరోజూ రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా రద్దయ్యాయి. టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలన్నీ బంగాల్లో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆందోళనలు చేశాయి. 'సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ నేషన్' అంటూ నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగించారు.
రాజ్యసభ రేపటికి వాయిదా
బంగాల్లో సీబీఐ తీరును నిరసిస్తూ రాజ్యసభలో విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. సభాపతి ఎంతగా వారించిప్పటికీ సభ్యులు వినకపోవడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు.
రాజ్యసభ రేపటికి వాయిదా
సభ ప్రారంభమైనప్పటి నుంచి రాజ్యసభలో నిరసనలు చెలరేగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం అనంతరం సభ్యులు సభా నిబంధనలకు అనుగుణంగా వారి ప్రశ్నలను లేవనెత్తొచ్చని డిప్యూటీ చైర్మన్ చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు.
సభను పలుమార్లు వాయిదా వేసినప్పటికీ సభ్యులు దారికి రానందున సభను రేపటికి వాయిదా వేశారు సభాపతి.