తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీని కాంగ్రెసే​ ఓడించగలదు.. ఆప్​ కాదు'

ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​పై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీని ఓడించడం ఆప్​ వల్ల కాదని.. కాంగ్రెస్​ పార్టీ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. తూర్పు దిల్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'మోదీని కాంగ్రెస్​ ఓడించగలదు... ఆప్​ కాదు'

By

Published : May 10, 2019, 4:38 AM IST

Updated : May 10, 2019, 9:30 AM IST

'మోదీని కాంగ్రెస్​ ఓడించగలదు... ఆప్​ కాదు'

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీఆమ్​ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలుచేశారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, భాజపాకు ఆమ్ఆద్మీ పార్టీ తలుపులు తెరిచిందని గుర్తుచేశారు. మోదీని అరవింద్​ కేజ్రీవాల్​ పార్టీ ఓడించలేదని... అది కాంగ్రెస్​ వల్లే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. తూర్పు దిల్లీలో కాంగ్రెస్​ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ తరఫున రాహుల్​ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ హామీలు ఇస్తారే తప్ప... వాటిని నెరవేర్చరని ఆరోపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్​ అనే నినాదంతో ఆమ్​ఆద్మీ పార్టీ ప్రజల ముందుకెళ్లిందని విమర్శించారు రాహుల్ ​గాంధీ.

మోదీ భయపడుతున్నారు

ఎన్నికల ఫలితాల గురించి ప్రధాని మోదీ భయపడుతున్నారని ట్వీట్​ చేశారు రాహుల్. ​

"ప్రియమైన మోదీ... ఇటీవలి మీ ప్రకటనలు, ఇంటర్వ్యూలు, వీడియోల ద్వారా మీరు ఒత్తిడిలో ఉన్నారనే ఏకైక భావన దేశ ప్రజలకు కలుగుతోంది. అయినా, ఎన్నికల ఫలితాల గురించి మీరు భయపడటం కచ్చితంగాతప్పేంకాదు."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

Last Updated : May 10, 2019, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details