తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరుద్యోగం, ఆర్థిక దుస్థితిపై రాహుల్​ దేశవ్యాప్త ర్యాలీలు

ఆర్థిక దుస్థితి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మొదటి ర్యాలీ జనవరి 28న జయపుర్​లో జరగనుంది.

Rahul to hold rallies across country over 'economic problems'
నిరుద్యోగం, ఆర్థిక దుస్థితిపై రాహుల్​ దేశవ్యాప్త ర్యాలీలు

By

Published : Jan 22, 2020, 5:21 AM IST

Updated : Feb 17, 2020, 10:56 PM IST

నిరుద్యోగం, ఆర్థిక దుస్థితిపై రాహుల్​ దేశవ్యాప్త ర్యాలీలు

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. పెరుగుతోన్న నిరుద్యోగం, ఆర్థిక సమస్యలపై దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్​ నేతలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన తొలి ర్యాలీ జనవరి 28న రాజస్థాన్​ జయపుర్​లో జరగనుంది.

దేశ ఆర్థిక దుస్థితి కారణంగా ఉద్యోగాలు లేక యువత ఎదుర్కొంటున్న సమస్యలు, పెరుగుతోన్న నిరుద్యోగం వంటి విషయాలపై రాహుల్​ గాంధీ దృష్టి పెట్టనున్నట్లు కాంగ్రెస్​ నేతలు తెలిపారు.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టే ముందే రాహుల్​ తొలి ర్యాలీ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం మధ్యప్రదేశ్​లో రైతులు, గిరిజనులు, గ్రామీణ ఉద్యోగులను ఉద్దేశించి రాహుల్​ ఓ ర్యాలీ నిర్వహించనున్నారు.

తర్వాత ముంబయిలోని చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ముందు రాహుల్​ మాట్లాడనున్నట్లు కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​పై కసరత్తు జరుగుతున్నట్లు రాజస్థాన్​ ఉపముఖ్యమంత్రి సచిన్​ పైలట్​ తెలిపారు.

తొలిసారి...

పార్లమెంటు ఆమోదించిన చట్టంపై తొలిసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని సచిన్​ పైలట్​ ఆరోపించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నట్లు ప్రస్తావించారు. దేశ ఆర్థిక దుస్థితి కారణంగా ముఖ్యంగా నిరుద్యోగులు నష్టపోతున్నారన్నారు పైలట్​.

Last Updated : Feb 17, 2020, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details