కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన అనుచరుల ముందు లొంగిపోయిందని ఆరోపించారు. అందుకే ఇక నుంచి ఎన్నికల సంఘానికి ఏమాత్రం భయపడేది లేదని... గౌరవం కూడా ఇవ్వమని ట్వీట్ చేశారు.
మోదీ ముందు ఈసీ లొంగిపోయింది : రాహుల్ - Rahul
ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన అనుచరులకు ఈసీ లొంగిపోయిందని విమర్శించారు.
మోదీ ముందు ఈసీ లొంగిపోయింది : రాహుల్
" ఎన్నికల బాండ్ల నుంచి ఈవీఎంల అవకతవకలు.. నమోటీవీ, మోదీ సైన్యం నుంచి ఎన్నికల షెడ్యూల్ మార్పు వరకు చూశాం. ఇప్పుడు కేదార్నాథ్లో నాటకం నడుస్తోంది. నరేంద్రమోదీ, ఆయన అనుచరుల ముందు ఎన్నికల సంఘం లొంగిపోయిందని దేశ ప్రజలందరికీ స్పష్టమవుతోంది. ఇంతవరకు ఈసీకి భయపడ్డాం, గౌరవమిచ్చాం. ఇక నుంచి అవేవీ ఉండవు. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు