మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం సహా దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఉన్నతాధికారులు దిల్లీలో ఇటీవల సమావేశమయ్యారు. ఎంతో గౌరవంగా భావించే క్వాక్వారెల్లి సైమండ్స్(క్యూఎస్) ర్యాంకింగ్స్‌లో భారత విశ్వవిద్యాలయాలు వెనుకంజ వేయడంపై ఈ భేటీలో చర్చించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి లండన్‌కు చెందిన క్యూఎస్ సంస్థ అధికారులూ హాజరయ్యారు.
విద్యా ఖ్యాతి, యజమాని ప్రతిష్ఠ, అధ్యాపక-విద్యార్థుల నిష్పత్తి, అంతర్జాతీయ అధ్యాపకులు, అంతర్జాతీయ విద్యార్థులు వంటి అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్‌ను అందజేస్తుంది క్యూఎస్.
నాణ్యతలో భేష్... కానీ
నాణ్యత, విశ్వసనీయత వంటి అంశాల్లో మన విశ్వవిద్యాలయాలు ముందున్నాయని... కానీ క్యూఎస్ వీటిని పరిగణించదని ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియల్ పేర్కొన్నారు. ఇతర అంశాలను పరిగణించి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాలు కైవసం చేసుకోవడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.