తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక - migrant woman walking thousand kilometers

నెలలు నిండి ఏ సమయంలో ప్రసవం అవుతుందో తెలియని ఓ గర్భిణి.. ఎలాగైనా ఇంటికి వెళ్లాలని వందల కిలోమీటర్లు కాలిబాట పట్టింది. మండుటెండను లెక్కచేయకుండా రాజస్థాన్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని తన స్వస్థలానికి పయనమైంది.

pregnant woman walking from surat to uttar pradesh with family
నెలలు నిండిన గర్భవతి.. మండుటెండను సైతం మరచి

By

Published : May 21, 2020, 4:47 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కారణంగా వలసకూలీల కష్టాలు అన్నీఇన్నీ కావు. స్వస్థలాలకు చేరుకోవాలన్న ఆశతో కొందరు వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఇలానే ఓ నిండు గర్భిణి రాజస్థాన్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని తన స్వగ్రామం కాస్​గంజ్​ చేరేందుకు.. కాలిబాట పట్టింది. కుటుంబంతో కలిసి వందల కిలోమీటర్లు ప్రయాణించింది.

నెలలు నిండిన గర్భవతి.. మండుటెండను సైతం మరచి

ఇప్పటికే నెలలు నిండిన ఆ మహిళకు.. ఏ సమయంలో ప్రసవం అవుతుందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలోనే త్వరగా ఇంటికి వెళ్లాలని ఆశిస్తున్నారు కుటుంబసభ్యులు. మహిళతో పాటు ఇంకా అనేక మంది వలసకార్మికులు రాజస్థాన్​ సరిహద్దులో నడవడం కనిపించారు. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. మండెటెండను లెక్క చేయకుండా ప్రయాణం సాగిస్తున్నారు.

బస్సులు పంపినప్పటికీ..

ఇటీవలే రాజస్థాన్​లోని కాంగ్రెస్​ ప్రభుత్వం​ ఉత్తర్​ప్రదేశ్​కు వలస కూలీలను పంపేందుకు వెయ్యి బస్సులను కేటాయించినట్లు తెలిపింది. అయితే యోగి ప్రభుత్వం వాటిని అనుమతించకపోవడం వల్ల అవన్నీ తిరిగి రావలసి వచ్చిందని కాంగ్రెస్​ నేతలు పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details