తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇది ఛాయ్​వాలా పథకం'

'శ్రమ్​యోగి మాన్​ధన్'​ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించారు. గుజరాత్​లోని వస్త్రాల్​ పర్యటనలో కాంగ్రెస్​ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు మోదీ.

ప్రధాని నరేంద్రమోదీ

By

Published : Mar 5, 2019, 5:53 PM IST

పేదరికం కొందరి దృష్టిలో ఫొటోలకే పరిమితమని కాంగ్రెస్​ పార్టీ నేతలనుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు సంధించారు. గుజరాత్​ వస్త్రాల్​లో 'ప్రధాన మంత్రి శ్రమ్​యోగి మాన్​ధన్'​ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు మోదీ. పేదరికమంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ దృష్టిలో కేవలం మానసిక స్థితి మాత్రమేనని ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ

"కొన్ని వర్గాల ప్రజల వృద్ధికి ఈ పథకం ఉపయోగపడుతుంది. పేదరికాన్ని అంతం చేయాలని వాళ్లు (కాంగ్రెస్) నినాదాలు ఇచ్చారు. కార్మికుల దేవుళ్లమని చెప్పుకున్నారు. చాలా రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు సైతం పరిపాలించారు. కానీ అసంఘటిత రంగాన్ని మాత్రం పట్టించుకోలేదు. పేదల పేరు చెప్పుకుని 55 ఏళ్లు పాలించారు. 55 ఏళ్లలో వాళ్లేం చేశారు? కేవలం 55 నెలల్లోనే ఛాయ్​వాలా ఈ పథకాన్ని తీసుకొచ్చాడు.
వారికి పేదరికమనేది కేవలం మానసిక స్థితి. చూడండి ఈ నేత(రాహుల్​ గాంధీ) పేదరికమే లేదంటున్నాడు. అది కేవలం మానసిక స్థితి మాత్రమే అని చెబుతున్నాడు. పేదరికమనేది వాళ్లకు ఫొటోలకే పరిమతం. ఒక్క రోజైనా ఆకలి బాధ తెలియని వారు సైతం పేదరికంపై మాట్లాడుతున్నారు. "

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

శ్రమ్​యోగి మాన్​ధన్(పీఎంఎస్​వైఎం)

సంఘటిత రంగంలో ఈపీఎఫ్ పథకం తరహాలోనే 'శ్రమ్ యోగి మాన్​ధన్​' అమలవుతుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తూ రూ. 15వేల లోపు జీతం పొందుతున్న 18 నుంచి 40 ఏళ్ల వయసుగల అసంఘటిత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.

బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ తప్పనిసరి. పథకంలో 8 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల వారి వాయిదాగా కనీసంగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అరవై ఏళ్ల వరకూ కొనసాగించాలి. 60 ఏళ్ల తర్వాత జీవితాంతం నెలకు కనీసంగా రూ.3,000 పెన్షన్ లభిస్తుంది.

ఇదీ చూడండి:"ఇదో ట్రెండ్ అయిపోయింది"

ABOUT THE AUTHOR

...view details