రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22న ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. రక్షణ, అణు రంగం, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలపేతానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో చర్చలు జరపనున్నారు మోదీ.
ఫ్రాన్స్ నుంచేఈ నెల 23న యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు బయలుదేరనున్నారు ప్రధాని. 25న ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చి బియరిజ్ నగరంలో జరగనున్న జీ7 సదస్సులో పాల్గొననున్నారు.