తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేటి నుంచి కోల్​కతాలో ప్రధాని మోదీ పర్యటన - PM Kolkata visit

ప్రధాని నరేంద్ర మోదీ కోల్​కతాలో నేటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటన చేయనున్నారు. మొదటిగా ఆయన కోల్​కతా పోర్టు ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వారసత్వ భవంతులైన ఓల్డ్ కరెన్సీ భవంతి, బెల్వెదెరె హౌస్​, మెట్​ఖాఫె హౌస్​, విక్టోరియా మెమోరియల్​ హాలును జాతికి అంకితం చేస్తారు. సుందర్బన్స్​కు చెందిన 200 మంది గిరిజన బాలికల కోసం కౌషల్ వికాస్ కేంద్రం, ప్రీతిలత ఛాత్రి ఆవాస్​ను ప్రారంభిస్తారు.

PM on two-day Kolkata visit from Saturday
నేటి నుంచి కోల్​కతాలో ప్రధాని మోదీ పర్యటన

By

Published : Jan 11, 2020, 4:31 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు బంగాల్​ రాజధాని కోల్​కతాలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఆయన కోల్​కతా పోర్ట్ ట్రస్టు 150వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. పోర్టు ట్రస్టులో పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల పెన్షన్ ఫండ్​ లోటును తీర్చడానికి తుది విడత రూ.501 కోట్లు చెక్కును మోదీ అందజేస్తారు.

రామకృష్ణమఠం సందర్శన

శనివారం సాయంత్రం మోదీ బేలూరులోని రామకృష్ణ మఠాన్ని కూడా దర్శించనున్నారని అధికారిక సమాచారం.

సాంస్కృతిక భవనాలు

అనంతరం వారసత్వ భవంతులైన ఓల్డ్ కరెన్సీ భవంతి, బెల్వెదెరె హౌస్​, మెట్​ఖాఫె హౌస్​, విక్టోరియా మెమోరియల్​ హాలును జాతికి అంకితం చేస్తారు. ఈ నాలుగు భవంతులను ఇటీవలే సాంస్కృతిక మంత్రిత్వశాఖ పునరుద్ధరించింది.

సాంస్కృతిక మంత్రిత్వశాఖ దేశంలోని వివిధ మెట్రో నగరాల్లోని ఐకానిక్ భవనాల చుట్టూ సాంస్కృతిక ప్రదేశాలను అభివృద్ధిచేస్తోంది. ప్రధానంగా కోల్​కతా, దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, వారణాసిల్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు.

గిరిజన బాలికల కోసం

కోల్​కతా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ... సుందర్బన్స్​కు చెందిన 200 మంది గిరిజన బాలికల కోసం కౌషల్ వికాస్ కేంద్రం, ప్రీతిలత ఛాత్రి ఆవాస్​ను ప్రారంభిస్తారు.

సీఏఏ సెగలపై చర్చ!

కోల్​కతా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని బంగాల్​ భాజపా ప్రతినిధి బృందం కలిసే అవకాశం ఉంది. పౌరసత్వ చట్ట సవరణపై తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఎదుర్కొనే వ్యూహంపై మోదీతో చర్చ జరపాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల భోగట్టా.

ఇదీ చూడండి:సీడీఎస్​కు దన్నుగా 40 మంది అధికారుల నియామకం

ABOUT THE AUTHOR

...view details