బిహార్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 10 రోజుల్లో దాదాపు రూ.16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, పథకాలను మోదీ ఆవిష్కరిస్తారని సమాచారం. ఇవి బిహార్ ప్రజల మౌలిక సదుపాయాలు, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని భాజపా భావిస్తోంది.
ఇవేనా అవి...
ఎల్పీజీ పైప్లైన్, ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్, నమామీ గంగ, నీటి సరఫరా పథకాలలో భాగంగా మురుగు నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, కొత్త రైల్వే లైన్, రైల్వే వంతెన, రహదారులు, వంతెనలకు విద్యుదీకరణ, నిర్మాణ పనులను.. మోదీ ఆవిష్కరించనున్నారు. ఆయా కార్యక్రమాల ప్రారంభ సమయంలో ప్రజలతో వర్చువల్ చర్చా వేదికల్లోనూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.