తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​ను చూసి నేతాజీ గర్వపడేవారు'

Prime Minister Narendra Modi is in Kolkata today to attend programmes commemorating Netaji Subhas Chandra Bose’s 125th birth anniversary. He presides over the inaugural function of the 'Parakram Diwas' celebrations at Victoria Memorial in Kolkata. A cultural programme "Amra Nuton Jouboneri Doot", based on the theme of Netaji, is also scheduled.

PM Modi attends Netaji s 125th birth anniversary programmes
బంగాల్​లో నేతాజీ జయంతి వేడుకలకు మోదీ

By

Published : Jan 23, 2021, 1:08 PM IST

Updated : Jan 23, 2021, 6:08 PM IST

18:03 January 23

నేతాజీ గర్వపడేవారు..

ఒకప్పుడు నేతాజీ కలలు కన్న విధంగా.. ఇప్పుడు ఎల్​ఏసీ నుంచి ఎల్​ఓసీ వరకు భారత దేశం ఎంతో శక్తివంతంగా ఎదిగిందని ప్రధాని వెల్లడించారు. దేశ సార్వభౌమత్యానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారీ భారత్​ దీటుగా జవాబు చెప్పిందన్నారు.

ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్​ గురించి ప్రస్థావించారు. నేతాజీ ఇప్పుడు ఉండి ఉంటే.. టీకా విషయంలో ఇతర దేశాలకు భారత్​ సహాయం చేస్తున్న తీరును చూసి గర్వపడేవారని పేర్కొన్నారు.

17:23 January 23

మోదీ ప్రసంగం...

  • రామకృష్ణ చైతన్యప్రభు, వివేకానంద, చిత్తరంజన్‌ దాసు వంటి మహానుభావులు పుట్టారు
  • ఈ పుణ్యభూమిలో మహామహా వ్యక్తులు పుట్టారు: ప్రధాని మోదీ
  • మహానుభావులకు విజ్ఞానికి కూడా కోల్‌కతా పుట్టినిల్లు: ప్రధాని మోదీ
  • జాతీయ గీతం, జాతీయం గేయం కూడా ఈ పుణ్యభూమి నుంచే వచ్చాయి: ప్రధాని మోదీ
  • స్వాతంత్ర్య సంగ్రామాన్ని నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ ఒక్క కొత్త దారిలో తీసుకెళ్లారు

17:15 January 23

మమత అసహనం...

వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించాల్సిన సమయంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కొందరు వ్యక్తులు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ప్రసంగించకుండానే వెనుదిరిగారు మమత.

17:07 January 23

వేడుకలు..

నేతాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. సుభాష్​ చంద్రబోస్​ లేఖలతో కూడిన పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అనంతరం నేతాజీ స్మరణలో పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేశారు.

16:26 January 23

విక్టోరియా మెమోరియల్​..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విక్టోరియా మెమోరియల్​ను సందర్శించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్​ ధన్​కర్​లు కూడా మోదీ వెంటే ఉన్నారు.

15:58 January 23

నేషనల్​ లైబ్రరీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కోల్​కతాలోని నేషనల్​ లైబ్రరీని సందర్శించారు. నిర్వహకులు మోదీకి లైబ్రరీ విశేషాలను వివరించారు.

15:34 January 23

నేతాజీ భవన్​లో..

బంగాల్​లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ కోల్​కతాలోని నేతాజీ భవన్​ను సందర్శించారు. 

మరికొద్ది సేపట్లో నేతాజీ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు మోదీ. ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు.

15:22 January 23

కోల్​కతాలో మోదీ..

అసోం పర్యటనను ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బంగాల్​ రాజధాని కోల్​కతాకు చేరుకున్నారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సారథి నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. 

12:45 January 23

బంగాల్​లో నేతాజీ జయంతి వేడుకలకు మోదీ

స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సారథి నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు బంగాల్​ వెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కోల్​కతాలో భాజపా ర్యాలీకి హాజరుకానున్నారు.

కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జనవరి 23న నేతాజి జయంతిని 'పరాక్రమ్ దివస్'‌గా జరపాలని ఇటీవలే కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బంగాల్​ వ్యాప్తంగా భాజపా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Last Updated : Jan 23, 2021, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details