తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏపై ఆత్మరక్షణ వద్దు- దూకుడుగానే ముందుకు'

సీఏఏపై ఎన్డీఏ ఆ​త్మరక్షణ వైఖరి అవలంబించాల్సిన అవసరం లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మిత్ర పక్షాలు సీఏఏ అంశమై ప్రభుత్వానికి బలంగా మద్దతివ్వాలని ఎన్డీఏ పార్టీ భేటీలో పిలుపునిచ్చారు.

By

Published : Jan 31, 2020, 7:46 PM IST

Updated : Feb 28, 2020, 4:55 PM IST

modi
ఎన్డీఏ భేటీలో మోదీ

దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలతో ఆత్మరక్షణలో పడినట్లు భావించకూడదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎన్​డీఏ పక్షాలు సీఏఏకు బలంగా మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. దిల్లీలో జరిగిన ఎన్​డీఏ పక్షాల సమావేశంలో ఈమేరకు దిశానిర్దేశం చేశారు మోదీ.

సీఏఏ.. ముస్లింలకు వ్యతిరేకమని వాదిస్తున్న విపక్షాలకు దీటుగా సమాధానమివ్వాలని మోదీ పేర్కొన్నారని సమాచారం. సీఏఏ ద్వారా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని, ఆత్మరక్షణలో పడినట్లు భావించేందుకు ఆస్కారమే లేనట్లు మోదీ అన్నట్లు తెలిసింది.

భేటీ సందర్భంగా బోడో ఒప్పందం, త్రిపురలో స్థిరపడిన బ్రూ తెగ అంశాన్ని ప్రధాని వద్ద ఎన్​డీఏ నేతలు ప్రస్తావించారని సమచారం.

సీఏఏపై బడ్జెట్ సెషన్ సమయంలోనే దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్న వేళ మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి: ఉరి తీసేవరకూ పోరాడుతా: నిర్భయ తల్లి

Last Updated : Feb 28, 2020, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details