తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"శభాష్ వర్ధమాన్"

భారత వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ తల్లిదండ్రులకు దిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. దేశ రక్షణలో అభినందన్‌‌ చూపిన ధైర్య సాహసాలకు తోటి ప్రయాణికులు.. కరతాళధ్వనులతో ఆయన తల్లిదండ్రులను విమానంలోకి ఆహ్వానించారు.

By

Published : Mar 1, 2019, 3:38 PM IST

పైలట్​ తల్లిదండ్రులకు స్వాగతం

పైలట్​ తల్లిదండ్రులకు స్వాగతం

భారత వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ తల్లిదండ్రులకు దిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భారత పైలట్​ను స్వదేశానికి అప్పగించనున్న నేపథ్యంలో కన్న బిడ్డను చూసేందుకు అభినందన్‌ తల్లిదండ్రులు వాఘా బయల్దేరారు. కమాండర్ తండ్రి విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌ వర్ధమాన్‌, శోభా వర్ధమాన్‌ గురువారం రాత్రి చెన్నై నుంచి దిల్లీకి విమానంలో చేరుకున్నారు. దేశ రక్షణలో అభినందన్‌‌ చూపిన ధైర్య సాహసాలకు గౌరవంగా తోటి ప్రయాణికులు.. కరతాళధ్వనులతో ఆయన తల్లిదండ్రులను విమానంలోకి ఆహ్వానించారు. గౌరవ సూచకంగా లేచి నిలబడి స్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details