దేశంలో జనాభా నియంత్రణపై భాజపా నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించింది దిల్లీ హైకోర్టు. ఈ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 3న చేపడతామని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని ధర్మానసం ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖతో పాటు న్యాయ సంఘానికీ నోటీసులు జారీ చేసింది.
జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేలా కోర్టు ఆదేశాలివ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు. జనాభాను నియంత్రించేందుకు రాజ్యాంగంలో ఆర్టికల్-47ఏను చేర్చాలన్న రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్(ఎన్సీఆర్డబ్ల్యూసీ) ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.