తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షీనాబోరా హత్యకేసులో పీటర్​ ముఖర్జీకి బెయిల్​

షీనాబోరా హత్యకేసులో పీటర్​ ముఖర్జీకి బెయిల్​ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. పీటర్​కు హత్యతో సంబంధముందని తెలిపే సరైన ఆధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Peter Mukerjea has been granted bail by Bombay High Court.
పీటర్​ ముఖర్జికి బెయిల్​ మంజూరు చేసిన బాంబే హైకోర్టు

By

Published : Feb 6, 2020, 6:03 PM IST

Updated : Feb 29, 2020, 10:34 AM IST

షీనాబోరా హత్యకేసులో పోలీసులు అరెస్టు చేసిన మీడియా రంగ దిగ్గజం పీటర్ ముఖర్జీకి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుతో పీటర్‌కు సంబంధముందని చూపే ఆధారాలేమీ లేనందున బెయిల్ ఇచ్చినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. 2 లక్షల రూపాయల పూచీకత్తుపై జస్టిస్ నితిన్ శంబ్రె ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

తన కుమార్తె విధి, కుమారుడు రాహుల్ ముఖర్జీ సహా.. ఇతర సాక్షులను కలవరాదని నిబంధన విధించారు. అయితే... సీబీఐ విన్నపం మేరకు తీర్పుపై 6 వారాల వరకు స్టే విధించింది. ఈలోపు ఆ తీర్పుకు వ్యతిరేకంగా మరో పిటిషన్ వేసే వీలుంటుంది. షీనా బోరా హత్య కేసులో పీటర్ మాజీ భార్య ఇంద్రాణీ ముఖర్జీ ప్రధాన నిందితురాలు కాగా.. పీటర్‌ను పోలీసులు 2015లో అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: రెండు భావజాలాల మధ్యే యుద్ధం!

Last Updated : Feb 29, 2020, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details