కొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు. ఎదురుగా ఎన్నో సవాళ్లు. ఏకమవుతున్న విపక్షాలు. అధికారం ఎవరిదన్నదానిపై లేని స్పష్టమైన అంచనాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాకర్షక మంత్రానికే జైకొట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. మధ్యంతరం అంటూనే వరాల బడ్జెట్ తెచ్చింది. రైతులు, పేద, మధ్యతరగతి, పట్టణ ప్రజలు, ఉద్యోగుల ఓట్లకు గురిపెట్టింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు, రైతులకు ప్రత్యక్ష నగదు సాయం వంటి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించింది.
దేశవ్యాప్తంగా 'రైతు బంధు'
దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని దృష్ట్యా మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కర్షకుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఆర్థిక సాయం ప్రకటించింది. 5 ఎకరాలలోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్థికసాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా 12కోట్ల మంది రైతులకు లబ్ధిచేకూరుతుందని అంచనా.
పన్నుల ఊరట
2014లో అధికారంలో వచ్చాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని పెంచింది మోదీ ప్రభుత్వం. ఆ తర్వాత దాని జోలికి వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ పన్ను రిబేటును 5లక్షల రూపాయలకు పొడిగించింది. పొదుపు, పెట్టుబడులు కలిపి పన్ను రిబేట్‌ను రూ. 6.50 లక్షల వరకు పెంచింది. స్డాండర్డ్ డిడక్షన్, టీడీఎస్ వంటి ఇతర విషయాల్లోనూ వేతన జీవులకు ఊరట కలిగించేలా ప్రకటనలు చేసింది కేంద్రం.
పింఛన్ల ప్రకటన