త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తామనే సంకేతాలను పంపారు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయులు ఉత్పల్, అభిజత్. తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తామంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. వారిద్దరు లోక్‌సభ ఎన్నికలు, పనాజీ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లోకి మనోహర్ పారికర్ తనయులు! - Utpal
తాము త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తామనే సంకేతాలిచ్చారు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయులు ఉత్పల్, అభిజత్. తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తామంటూ స్పష్టం చేశారు.
" రాష్ట్రానికి, దేశానికి మా తండ్రి చేసిన సేవలను మేమూ కొనసాగిస్తాం. జీవితంలోని చివరి క్షణం వరకు రాష్ట్ర సమస్యల గురించే ఆయన ఆలోచించారు. ప్రతిరోజు శక్తిని ధారబోసి రాష్ట్రసేవ చేయాలని తపనపడ్డారు. నాన్న మరణం మా కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.
నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అన్నివిధాలా సాయమందించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులందరికీ ధన్యవాదాలు. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపినందుకు దేశ సైన్యానికి కృతజ్ఞతలు."
- పారికర్ తనయుల ప్రకటన