అమృత్సర్ ఎంపీ టికెట్ తనకివ్వకుండా నిరాకరించారని నవజోత్ కౌర్ చేసిన ఆరోపణలను పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్ ఖండించారు. పార్టీ టికెట్ కేటాయించినా కౌరే తిరస్కరించారని అన్నారు. అమృత్సర్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుందని స్పష్టంచేశారు అమరిందర్.
తన భార్యకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదని కౌర్‌కు మద్దతుగా నిలిచారు పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు.
ఛండీగఢ్ నుంచి పోటీ చేయాలని భావించిన కౌర్‌కు పార్టీ ఆ స్థానాన్ని కేటాయించలేదు. కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సాల్‌ను బరిలోకి దింపింది.