రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యతో భేటీ..
నేడు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చ సమయంలో.. విపక్షాల గందరగోళం చేయడంపై విచారణ చేపట్టారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. ఇందుకోసం వెంకయ్య అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి తదితరులు హాజరయ్యారు.