తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2019, 12:57 PM IST

ETV Bharat / bharat

'అన్యాయంపై పోరాటం చేయని వ్యక్తి పిరికివాడే'

దిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్​ చేపట్టిన 'భారత్​ బచావో' ర్యాలీ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు ఆ పార్టీ​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమై, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలో జరుగుతోన్న అన్యాయంపై పోరాడని వ్యక్తి పిరికివాడికింద లెక్కేనని వ్యాఖ్యానించారు.

Priyanka Gandhi
ప్రియాంక గాంధీ

దేశంలో జరుగుతోన్న అన్యాయంపై పోరాడని వ్యక్తిని సమాజం పిరికివాడిగా పరిగణిస్తుందన్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మౌనంగా ఉంటే మన రాజ్యాంగం నాశనమవుతుందని, దేశ విభజన ప్రారంభమవుతుందని హెచ్చరించారు.

'భారత్ బచావో' పేరిట​ దిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్​ నిర్వహించిన బహిరంగ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రియాంక.

ప్రియాంక గాంధీ

"దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వృద్ధి క్షీణించి, ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. వీటన్నింటి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలంతా స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఎన్నడూ లేని విధంగా ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

అగ్ర నేతలు హాజరు..

భారత్​ బచావో కార్యక్రమంలో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, రాహుల్​ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బంగాల్​లో ఆరని 'పౌర' సెగలు.. నిరసనలు ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details