భారతీయులను కరోనా వైరస్ తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రజలు వైరస్ బారినపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. దీని వల్ల దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపై ప్రజలు కనపడటం లేదు. కరోనా వల్ల వేసవి సెలవులు నెలరోజులు ముందుగానే వచ్చినట్టు అయ్యింది.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతోంది. ఇప్పటి వరకు 63 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఒకరు మరణించారు. అప్రమత్తమైన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మార్చి 31 వరకు ముంబయి, పుణె, నాగ్‌పుర్ సహా ప్రధాన నగరాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాలన్నీ మూసివేయాలని నిర్ణయించింది. కేవలం నిత్యవసర దుకాణాలు, అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
నాగపుర్‌లో బహిరంగ ప్రదేశాలను ప్రజలు ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీనితో ఆ నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు గుమిగూడారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ సీటు లభించని పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీలో...