తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పంజా: 17 మరణాలు- 724 కేసులు - కరోనావైరస్ చికిత్స

భారత్​లో కరోనా మృతుల సంఖ్య 17కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 724 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిందని వెల్లడించింది ​ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

Number of coronavirus cases 724 in India, death toll 17: Health Ministry
భారత్​లో 17కు చేరిన కరోనా మృత్యుఘోష

By

Published : Mar 27, 2020, 10:51 AM IST

దేశంలో కరోనా మృతుల సంఖ్య 17కు చేరినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇప్పటి దాదాపు 11 రాష్ట్రాల్లో కరోనా మరణాలు నమోదయ్యాయి.

వైరస్​ ధాటికి మహారాష్ట్రలో నలుగురు మృతి చెందారు. గుజరాత్​లో ముగ్గురు కరోనా​కు బలయ్యారు. కర్ణాటకలో ఇద్దరు వైరస్​ సోకి మృతి చెందారు. తమిళనాడు, బంగాల్​, బిహార్​, పంజాబ్​, దిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్​ప్రదేశ్​లో ఒక్కో మరణం నమోదైంది.

​తొలి మరణం

రాజస్థాన్​లో తొలి కరోనా మరణం నమోదైంది. వైరస్​ సోకి ​ భిల్వారాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన ఆ వ్యక్తికి వైరస్​ సోకినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది.

ఇదీ చదవండి:ఆర్​బీఐ కీలక నిర్ణయం- వడ్డీరేట్లు భారీగా తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details