సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాలు అక్టోబర్ 1తో ముగియనున్నాయి. కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉభయ సభల సభ్యులు కరోనా బారినపడకుండా అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఉదయం 4 గంటల పాటు లోక్‌సభ, సాయంత్రం 4గంటల పాటు రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి ప్రశ్నోత్తరాల సమయం ఎత్తివేసే అవకాశం ఉండటం వల్ల శూన్యగంటతో ప్రారంభిస్తారని సమాచారం.