దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో మెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా ఒక్కరు కూడా వైరస్ బారిన పడలేదని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కేసుల రెట్టింపు సమయం 12.6 రోజులకు మెరుగుపడినట్లు స్పష్టం చేసింది.
9రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులేవీ నమోదు కాలేదు. అవి.. అండమాన్ నికోబార్ ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, గోవా, ఛత్తీస్గఢ్, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం.