తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీతి ఆయోగ్​ వీసీపై ఈసీ ఆగ్రహం

నీతిఆయోగ్​ వైస్​ ఛైర్మన్​పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రకటించిన 'న్యాయ్​' పథకంపై రాజీవ్​కుమార్​ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆయన మాటలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని స్పష్టం చేసింది.

By

Published : Apr 6, 2019, 9:34 AM IST

Updated : Apr 6, 2019, 10:31 AM IST

రాజీవ్ కుమార్

వీసీ రాజీవ్ కుమార్​పై ఈసీ ఆగ్రహం
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్​పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ న్యూన్​తమ్ ఆయ్ యోజన (న్యాయ్)ను వ్యతిరేకించడాన్ని తప్పుబట్టింది ఈసీ. అధికారి హోదాలో ఉండి హామీలపై మాట్లాడటం కోడ్​ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

అధికారంలోకి వస్తే 'న్యాయ్​' ద్వారా పేదలకు ఏటా 72 వేల రూపాయలు జీవన భృతిగా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మే 25 ప్రకటించారు. అదే రోజు పథకంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు రాజీవ్ కుమార్.

"ఎన్నికల్లో గెలిచేందుకు 1971లో గరిబీ హఠావో నినాదం, 2008లో ఒకే హోదా- ఒకే పింఛను పథకం, 2013లో ఆహార భద్రతతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. కానీ వాటిని అమలు చేయటంలో విఫలమైంది. అదే తీరుగా కనీస ఆదాయ హామీ కూడా అవకాశవాద హామీగానే ఉంటుంది."
-రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మే 27న రాజీవ్​కు నోటీసులు జారీ చేసింది ఈసీ. ఆయన సమాధానంపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి చర్యలు ఆమోదించబోమని హెచ్చరించింది.

"ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడటం తగదు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలులేదు. ఎన్నికల విధానంలో ఓటర్లలో అనుమానాలు రేకెత్తేలా వ్యాఖ్యానించకూడదు. వ్యవహార శైలిలోనే కాకుండా వ్యాఖ్యలు, ప్రకటనల్లోనూ పారదర్శకంగా ఉండాలి. అదే ఈ విషయంలో లోపించింది.
మీరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కమిషన్ తీర్మానించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి."
- నరేంద్ర బుటోలియా, ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ

ఇదీ చూడండి:మోదీ ప్రసంగంపై నివేదిక కోరిన ఈసీ

Last Updated : Apr 6, 2019, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details