నిర్భయ సామూహిక హత్యాచారం కేసు దోషి ముకేశ్ కుమార్.. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరి శిక్షపై స్టే విధించాలని వ్యాజ్యం నమోదు చేశాడు. న్యాయపరంగా చివరి అవకాశాన్ని వినియోగించుకున్నాడు ముకేశ్ కుమార్.
'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్ - నిర్భయ కేసు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులు.. ఉరి నుంచి తప్పించుకోవడానికి తమకున్న చివరి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దోషుల్లో ఒకరైన వినయ్‌కుమార్ శర్మ.. ఇప్పటికే సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా మరో నిందితుడు ముకేశ్ కుమార్ కూడా మరణ శిక్షను సవాల్ చేస్తూ అదే వ్యాజ్యం దాఖలు చేశాడు.
దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరు ముకేశ్ కుమార్. న్యాయస్థానం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీర్పు ఇచ్చిందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. సామాజిక-ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల ఆనారోగ్యం, జైల్లో సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశాడు.
నిర్భయ కేసులో మరో నిందితుడైన వినయ్‌కుమార్‌శర్మ మరణ శిక్షను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు.