తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమానుషం: కదిలే కారులో మహిళపై 10మంది అత్యాచారం - త్రిపుర

దేశంలో మద మృగాలు మరో మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాయి. త్రిపురలోని అగర్తలలో ఓ మహిళపై పది మంది సామూహిక అత్యాచారం చేశారు. తన కూతురి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న నిస్సహాయురాలిపై ఈ దారుణానికి ఒడిగట్టారు నర పిశాచులు.

అమానుషం: మహిళపై తొమ్మిది మంది అత్యాచారం

By

Published : Sep 27, 2019, 11:21 AM IST

Updated : Oct 2, 2019, 4:51 AM IST

త్రిపురలోని అగర్తలలో దారుణం జరిగింది. ఓ మహిళపై కదులుతున్న వాహనంలో పది మంది సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఇద్దరు పిల్లల తల్లిపై రాత్రంతా ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఆరేళ్ల తన చిన్నారి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ.... తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కింది. మహిళను ఎక్కించుకున్న తర్వాత ఆటో డ్రైవర్‌... ఆమెను వేరే మార్గంలో తీసుకెళ్లాడు. ఇది గమనించిన మహిళ ఎక్కడికి తీసుకెళ్తున్నావ్‌ అని ప్రశ్నించగా.... తనకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తీసుకొని వెళ్దామని నమ్మబలికాడు.

కదిలే కారులోనే..

మార్గమధ్యలో నలుగురు వ్యక్తులు ఆటో ఎక్కి........ ఆమెను బలవంతంగా వేరే కారులోకి ఎక్కించారు. కదిలే కారులో ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆటో డ్రైవర్​ సహా మరో నలుగురు వ్యక్తులు కూడా కారు ఎక్కి ఆమెపై అఘాయిత్యం చేశారు. అనంతరం ఆమెను సర్క్యూట్ హౌస్ దగ్గర వదిలేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ.... ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఆరుగురిని ఆరెస్టు చేశామని త్రిపుర పోలీసులు తెలిపారు.

Last Updated : Oct 2, 2019, 4:51 AM IST

ABOUT THE AUTHOR

...view details