"ఒక ఛాయ్‌వాలా బాధను మరో ఛాయ్వాలానే అర్థం చేసుకోగలడు" అంటూ అసోం ప్రజల్లో జోష్ నింపారు ప్రధాని నరేంద్రమోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు మోదీ. అసోం, పశ్చిమ్ బంగాలో తేయాకు కార్మికుల పరిస్థితి మెరుగుపరుస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.
"స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో అసోంలోని 40శాతం ఇళ్లకే విద్యుత్ వచ్చింది. అదే మా హయాంలో ప్రతి ఇంటికీ కరెంట్ వచ్చింది. మోదీ ప్రభుత్వంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దేశమంతా బాగానే ఉంది. వాళ్లు (కాంగ్రెస్, ఉగ్రవాదులు) మాత్రం బాధపడుతున్నారు. అసోం అకార్డ్‌లోని ఆరు సామాజిక వర్గాలు... అహోం, మోటాక్, మోర్నర్, సుతీయా, కోజ్ రాజవంశీయులు, టీ తెగలకు ఎస్టీ హోదా ప్రకటించేందుకు కృషి చేస్తున్నాం."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి