తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గృహ హింసపై ఫిర్యాదులకు వాట్సాప్​ నంబర్​

లాక్​డౌన్​ సమయంలో గృహి హింస కేసులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్​ నంబర్​ను అందుబాటులోకి తెచ్చింది జాతీయ మహిళా కమిషన్. మహిళలు అత్యవసర సమయాల్లో 72177 35372ను సంప్రదించాలని సూచించింది.

NCW launches WhatsApp number to report domestic violence during lockdown
ఇకపై వాట్సాప్​ ద్వారా గృహహింసా ఫిర్యాదులు

By

Published : Apr 11, 2020, 11:32 AM IST

Updated : Apr 11, 2020, 9:16 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. పురుషులు రోజంతా ఇంట్లోనే ఉంటున్న కారణంగా గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. అయినా... మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేసే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొన్న జాతీయ మహిళా కమిషన్... గృహ హింస కేసులపై ఫిర్యాదులకు ప్రత్యేకించి ఓ వాట్సాప్‌ నంబర్‌(72177 35372)ను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఈ నంబర్‌కు మెసేజ్ చేయాలని సూచించింది.

లాక్​డౌన్​ ముగిసేంత వరకు మాత్రమే ఈ వాట్సాప్​ నంబర్​ అమల్లో ఉంటుందని తెలిపింది ఎన్​సీడబ్ల్యూ. ఇప్పటికే మహిళల కోసం.. #181, #112 నంబర్లు అందుబాటులో ఉన్నాయని గుర్తుచేసింది.

త్వరలోనే ఆన్​లైన్​ కౌన్సిలింగ్​

లాక్​డౌన్​ సమయంలో గృహహింస ఫిర్యాదుల విషయంలో ఆయా రాష్ట్రాల కమిషన్లు ఎలా వ్యవహరిస్తున్నాయో చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎన్​సీడబ్ల్యూ. ఆన్​లైన్​, ఫోన్​ ద్వారా కౌన్సిలింగ్​ అందించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

దేశంలో మార్చి 25న లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ రేఖాశర్మ తెలిపారు. మార్చి 25 నుంచి ఏప్రిల్​ 1 వరకు 257 ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇందులో 69 కేసులు గృహహింసకు సంబంధించినవని ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వేళ పెరిగిన గృహ హింస కేసులు

Last Updated : Apr 11, 2020, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details