తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిజర్వేషన్లపై భాజపా ఇలా... మిత్రపక్షం అలా... - jp nadda latest news

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టంచేశారు. మరోవైపు.. రిజర్వేషన్లకు సంబంధించిన అన్ని చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో చేర్చాలని ఎన్డీఏ మిత్రపక్షం ఎల్​జేపీ నేత రాంవిలాస్​ పాసవాన్​ డిమాండ్​ చేశారు. దీనికోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Nadda says BJP committed to reservation, Paswan for putting quota laws in 9th schedule
రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: భాజపా

By

Published : Jun 12, 2020, 7:33 PM IST

రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన మరునాడే ఆ అంశంపై స్పష్టతనిచ్చింది భాజపా. రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

" మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. సామాజిక న్యాయం పట్ల మా నిబద్ధతపై ఎలాంటి అనుమానం అవసరంలేదు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా చాలా సార్లు చెప్పారు. సామాజిక సామరస్యం, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం"

-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు.

9వ షెడ్యూల్​లో చేర్చాలి..

రిజర్వేషన్లకు సంబంధించిన అన్ని చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో​ చేర్చాలని ఎన్డీఏ భాగస్వామ్యపక్షం లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) అధినేత రాంవిలాస్​ పాసవాన్ డిమాండ్​ చేశారు. అలా చేస్తే చట్టపరంగా రిజర్వేషన్లను ఎవరూ సవాలు చేయలేరని తెలిపారు. ఇందుకోసం అన్ని పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాకపోయినప్పటికీ షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పాసవాన్ అన్నారు. మహాత్మా గాంధీ, బీ ఆర్​ అంబేడ్కర్​ మధ్య కుదిరిన పూనా ఒప్పందం ప్రకారమే రిజర్వేషన్లు ఉన్నప్పటికీ తరచూ ఈ అంశంపై వివాదాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంటరానితనం కారణంగానే షెడ్యూల్డ్​ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పించారని సుప్రీంకోర్టు కూడా చాలాకాలం క్రితమే తెలిపిందని పాసవాన్​ గుర్తు చేశారు.

రిజర్వేషన్‌ అనేది ప్రాథమిక హక్కు కాదని తమిళనాడు మెడికల్‌ కళాశాలల్లో ఓబీసీ అభ్యర్థుల కోటాపై పలువురు వేసిన పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: రిజర్వేషన్​ అనేది ప్రాథమిక హక్కు కాదు: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details