తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.50కే ఎంఆర్​ఐ స్కాన్​.. రూ.600కే డయాలసిస్​

పేదలకు సాయం అందించేందుకు ఓ ఆసుపత్రి గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రూ.50కే ఎంఆర్​ఐ స్కాన్, రూ.600కే డయాలసిస్ సేవలు అందించనుంది దిల్లీలోని గురుద్వారాకు చెందిన గురు హర్​క్రిషణ్ ఆసుపత్రి.

mri scan for rs 50 only in delhi gurudwara hospital
ఆస్పత్రి గొప్ప నిర్ణయం.. రూ.50కే ఎంఆర్​ఐ స్కాన్​

By

Published : Oct 4, 2020, 7:40 AM IST

Updated : Oct 4, 2020, 7:47 AM IST

దిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్​లోని గురు హర్​క్రిషణ్ ఆస్పత్రిలో పేదలకు రూ.50కే ఎంఆర్​ఐ స్కాన్, రూ.600కే డయాలసిస్ సేవలు అందించనున్నారు. ఎక్స్​రే, అల్ట్రా సౌండ్​ స్కాన్​లు రూ.150కే చేస్తారు.

డిసెంబర్​ నుంచి ఎంఆర్​ఐ

డయాలసిస్​ సేవలు వచ్చే వారం నుంచి, ఎంఆర్​ఐ, ఇతర స్కాన్​లు డిసెంబరు తొలివారం నుంచి అందుబాటులోకి వస్తాయని దిల్లీ సిఖ్ గురుద్వారా యాజమాన్య కమిటీ అధ్యక్షుడు మన్​జిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇందుకోసం రూ.6 కోట్ల విలువైన డయాగ్నోస్టిక్​ యంత్ర పరికరాలను ఆస్పత్రికి దాతలు అందజేసినట్లు చెప్పారు.

ఇందులో నాలుగు డయాలసిస్ యంత్రాలు, అల్ట్రా సౌండ్, ఎక్స్​రే, ఎంఆర్ఐ యంత్రం ఒక్కొక్కటి ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ స్కాన్​కు రూ. 2500 పైనే తీసుకుంటున్నారు. తాము పేదలకు రూ.50, ఇతరులకు రూ.800 మాత్రమే తీసుకుంటామని మన్​జిందర్ చెప్పారు.

Last Updated : Oct 4, 2020, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details